ముగిసిన కివీస్‌ బ్యాటింగ్‌.. టీమిండియా లక్ష్యం 177 పరుగులు

-

ఇటీవల న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా, తాజాగా టీ20 సిరీస్ కు సిద్ధమైంది. నేడు రాంచీలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 18, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 5 పరుగులతో ఉన్నారు. టీ20 సిరీస్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ కు మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రాంచీలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన భారత్… న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టులో ఓపెనర్లు ఫిన్ అలెన్ 35, డెవాన్ కాన్వే 52 పరుగులు చేశారు. చివర్లో డారిల్ మిచెల్ 30 బంతుల్లోనే 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిచెల్ స్కోరులో 3 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అర్షదీప్ సింగ్ 1, కుల్దీప్ యాదవ్ 1, శివమ్ మావి 1 వికెట్ తీశారు. ఉమ్రాన్ మాలిక్ ఒక ఓవర్ విసిరి 16 పరుగులు సమర్పించుకోవడంతో అతడికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news