ముగిసిన TSPSC నిందితుల విచారణ

-

పేపర్ లీక్ కేసులోనిందితులకు మార్చి 23 వరకు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. కాగా, టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ల విచారణ ముగిసింది. కార్యాలయంలోని రెండు సిస్టంలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులిద్దర్ని టీఎస్ పీఎస్సీ కార్యాలయం నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.టీఎస్ పీఎస్సీలో ఇద్దరు నిందితులను కాన్ఫిడేషన్ సెక్షన్ లో తీసుకెళ్ళి విచారణ చేసిన సిట్ టీం.. కాన్ఫిడేషన్ సెక్షన్ లో సిస్టం లోని ఐపిలను ఎలా మార్చారు. డైనమిక్ పాస్ వర్డ్ లను ఎలా ట్రేస్ చేశారని టెక్నికల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

HEAD LINE STORY: TSPSC Papers Leakage…Damage…for the Unemployed Youth! -  Tolivelugu తొలివెలుగు

మార్చి 5 లీకైన పేపరు కాకుండా ఇంకా ఎన్ని పేపర్స్ లీక్ చేశారు… గతేడాది జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ చేశారా వంటి వివరాలపై సిట్ ఆరాతీసింది. కాన్ఫిడేషన్ సెక్షన్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద పని చేస్తున్న శంకర్ లక్మి ని కూడా సిట్ ప్రశ్నించింది. అయితే తాను డైరీలో ఎక్కడా కూడా పాస్ వర్డ్ ను రాయలేదని చెప్పింది. రాజశేఖర్ రెడ్డి ఐపీ అడ్రస్ లను మార్చి కంప్యూటర్ లో పాస్ వర్డ్ దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఫిబ్రవరి 27 కంటే ముందు నుంచే లీకేజీ వ్యవహారం నడిపించినట్లు పోలీసులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news