ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అవసరమే అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు నివ్వగా దానిని వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఆ తీర్పును పున: పరిశీలించాలని కోరుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిటిషన్ వేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి వ్యతిరేకమని ఆయన పేర్కొన్ారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు అధికారం లేదని, పార్లమెంటులో చట్టం ,చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయొద్దని మాల సంఘాల నేతలు ఇటీవల భారత్ బంద్‌కు పిలుపునివ్వగా.. ఎస్సీ వర్గీకరణతో వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. కావాలనే కొందరు ఎస్సీ కేటగిరిలోని వెనుకబడిన వారికి న్యాయం జరగకుండా కుట్ర చేస్తున్నారని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సైతం స్వాగతించాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.