ఎనిమిదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ నిరాశకే గురిచేస్తోంది.- బట్టి విక్రమార్క

-

ఈ సారైనా రాష్ట్ర బడ్జెట్ ప్రజల అభివ్రుద్ధి సంక్షేమం, తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కాంగ్రెస్ ఆశిస్తుందని.. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ నిరాశకు గురిచేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు ఇచ్చే ప్రాధాన్యత, ఉద్యోగాల రిక్రూట్ మెంట్, పెద ప్రజలకు ఇళ్లు, 57 ఏళ్లకు ఇస్తామని చెప్పిన పెన్షన్లు బడ్జెట్ లో ఎప్పుడూ ఉంటాయని ఆశించాం.. కానీ ఎప్పుడూ ఉండటం లేదని ఆయన అన్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పించే వ్యవస్థను ఈ బడ్జెట్ లో ప్రవేశ పెడతారని ఆశిస్తున్నామని బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటుదని ఆశిస్తున్నామని అన్నారు. భూ సంస్కరణ ద్వారా ఇచ్చిన భూములకు  ధరణి వెబ్ సైట్ ద్వారా తెలంగాణ పేరుపై పాస్ పుస్తకాలు ఇవ్వకుండా.. గత మూడేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని.. మూడేళ్ల నుంచి అసైన్డ్ దారులు రైతుబంధు పొందలేకపోతున్నారని.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధరణి వల్ల అనేక ఇబ్బందులను జరిగాయని… ఇటీవల జరిగిన జంట హత్యలు కూడా ధరణి వల్లే జరిగాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version