ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కీలక సమావేశం

-

కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి విజయం కోసం ప్రయత్నించినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి చెందింది. అయితే ఈనెల 24వ తేదీ నుంచి పార్లమెంట్ స్థానాలు కాబోతున్న విసయం తెలిసిందే. లోక్ సభకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వయనాడ్, రాయ్ భలేరి నుంచి పోటీ చేశారు రాహుల్ గాందీ. పోటీ చేసిన రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ విజయం సాధించారు.  రాయ్ బరేలీ నుంచి కంటిన్యూ అవుతారు. వయనాడ్ లో మరొకరినీ బరిలో దించనున్నట్టు తెలుస్తోంది. 

యూపీలో తమకు ఉన్నటువంటి పట్టును కోల్పోకూడదని.. రాయబలేరి సీటును ఉంచుకోనున్నాడు రాహుల్ గాందీ. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని సోనియాగాందీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈసమావేశానికి హాజరు కానున్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని నిర్ణయించారు. లోక్ సభ పక్ష నేతగా ఎవ్వరూ ఉండాలనేది ఇవాళ చర్చించనున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version