భారత్ జోడోయాత్రలో విషాదం.. పాదయాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేత మృతి

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర చేరుకున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మరణించారు. కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు కృష్ణ కుమార్ పాండే భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ మంగళవారం మరణించారు. యాత్రలో కుప్పకూలిన కృష్ణ కుమార్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే అతను మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెళ్లడించారు.

Top Cong Seva Dal leader 'KK' passes away during Bharat Jodo Yatra; Rahul  Gandhi pays last respects - IBTimes India

నాందేడ్ వద్ద కాంగ్రెస్ సేవా దళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ పాండే (75) మంగళవారం ఉదయం గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఈ విషయం గురించి ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జైరామ్ రమేశ్ ట్విట్టర్‌లో తెలియజేశారు. గుండెపోటుతో చనిపోయిన కృష్ణకుమార్ పాండేకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ.. దేశం పట్ల ఆయన అంకితభావం కాంగ్రెస్ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అన్నారు.