రేపటి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్ జరిగింది. ఈ రోజు సోనియా గాంధీ అధ్యక్షతన టెన్ జన్ పథ్ లోని ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె సురేష్, జైరామ్ రమేష్ వంటి కీలక నేతలు హాజరయ్యారు.
తాజాగా ఈ సమావేశం ముగిసింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు, ద్రవ్యోల్భనం, నిరుద్యోగం గురించి సమస్యలను లేవనెత్తుతాం అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల సమస్యలు.. 20 వేల మధ్య విద్యార్థుల భవిష్యత్ కోసం ఏం చేస్తారో ప్రశ్నిస్తామని ఎంపీ మానిక్కం ఠాగూర్ అన్నారు. నిరుద్యోగంపై ప్రశ్నిస్తామని.. ఎంఎస్ఎంఈ రంగాన్ని గందరగోళం చేశారని మానిక్కం ఠాగూర్ విమర్శించారు. బ్యాంకులను జాతీయ చేశారని బీజేపీపై మండిపడ్డారు.