వరంగల్ లో త్వరలో కాంగ్రెస్ బహిరంగ సభ… ముఖ్య అతిథిగా రానున్న రాహుల్ గాంధీ…!

-

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. దీంట్లో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. త్వరలోనే వరంగల్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ… వరంగల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రానున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, బలరాం నాయక్, వేణుగోపాల్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి తదితరులు 14 మంది భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న 40 లక్షల మందికి రూ. 6.5 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా 40 లక్షల డిజిటల్ సభ్యత్వాల గురించి రాహుల్ గాంధీకి వివరించనున్నారు. రాహుల్ గాంధీకి రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు తెలంగాణ నేతలు. అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న సీనియర్ నేతలపై చర్చలు తీసుకునే అంశాన్ని కూడా అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version