కర్ణాటక ‘కాంగ్రెస్’దే..!

-

వరుస పరాజయాలు..కేంద్రంలో పట్టు కోల్పోవడం..మోదీ-అమిత్ షా ద్వయం కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తుంది. వరుసగా కాంగ్రెస్‌ని మట్టికరిపిస్తుంది. ఆఖరికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలని కూల్చి అధికారం దక్కించుకుంటుంది. ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది..ప్రతిపక్షానికి కూడా పనికిరాదు అనుకునే తరుణంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..దేశమంతా కాలినడకన చుట్టేశారు. ప్రజలని కలిశారు. అటు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఇద్దరు కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులేశారు.

ఈ తరుణంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష మొదలైంది. 2018లో ఇక్కడ కాంగ్రెస్-జే‌డి‌ఎస్ కలిసి అధికారం పంచుకున్నాయి. కానీ అధికారాన్ని కూల్చి బి‌జే‌పి అధికార పగ్గాలు చేపట్టింది. అలా కమలం అధికారంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం సులువు కాదనే పరిస్తితి. ఒకవేళ మెజారిటీ సీట్లు వస్తాయేమో గాని..మళ్ళీ హాంగ్ వచ్చే పరిస్తితి ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బి‌జే‌పి..జే‌డి‌ఎస్ పార్టీని దువ్వడం మొదలుపెట్టింది. జే‌డి‌ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రెడీ అయింది.

అయితే హోరాహోరీగా అన్నీ పార్టీలు ఎన్నికల ప్రచారం చేశాయి. ఎవరి ఎత్తులు వారికి ఉన్నాయి. ఇక కన్నడ ప్రజలు తీర్పు ఇచ్చే రోజు వచ్చింది..స్టార్టింగ్ ఫలితాలు వెలువడే విధానం చూస్తే హాంగ్ వస్తుందనే డౌట్. ఈ క్రమంలో బి‌జే‌పి..జే‌డి‌ఎస్ తో మంతనాలు చేస్తున్నట్లు కథనాలు. ఇక ఈ కథనాలని పటాపంచలు చేస్తూ..224 సీట్లు ఉన్న కన్నడ నాట కాంగ్రెస్ జెండా పాతేసింది. మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లని దాటేసి. 117 సీట్లని గెలుచుకుని..ఇంకా 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అంటే దాదాపు 133 సీట్లు కాంగ్రెస్ సొంతం అవ్వడం ఖాయమనే పరిస్తితి.

అటు బి‌జే‌పి..59 స్థానాలని గెలుచుకుని 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అంటే 66 స్థానాల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇక జే‌డి‌ఎస్ 17 స్థానాల్లో గెలవగా, 4 స్థానాల్లో ఆధిక్యంలో కొంసాగుతుంది. జే‌డి‌ఎస్ కు 21 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతరులు 4 సీట్లు గెలిచారు. టోటల్ గా కాంగ్రెస్ 133, బి‌జే‌పి 66, జే‌డి‌ఎస్ 21, ఇతరులు 4 సీట్లు. మొట్టమి మీద కర్ణాటకని కాంగ్రెస్ సొంతం చేసుకుని..కేంద్రంలో కమలానికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version