ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఏదో కుట్రకోణం ఉందని టాలీవుడ్ సింగర్ కల్పన అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రానికి నేషనల్ ప్రైడ్ లాంటి యాక్టర్‌ను.. ఏదో దొంగతనం లేదా ఏదో పెద్ద క్రైమ్ చేసిన వాడిలాగా బెడ్ రూంలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇది న్యాయం కాదు. కచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, అల్లుఅర్జున్‌ను సంధ్య థియేటర్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఒక రోజు జైలు జీవితం తర్వాత ఆయన విడుదలయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మీద పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు బాధిత వ్యక్తి భాస్కర్ రెడీగా ఉన్నట్లు ప్రకటించాడు.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఏదో కుట్ర ఉంది
మన రాష్ట్రానికి నేషనల్ ప్రైడ్ లాంటి యాక్టర్‌ను.. ఎదో దొంగ తనం, లేదా ఏదో పెద్ద క్రైమ్ చేసిన వాడిలాగా బెడ్ రూంలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సరికాదు.
ఇది న్యాయం కాదు.. కచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది – సింగర్ కల్పన pic.twitter.com/AKSFXbB13l
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024