వేసవి కూల్ టూర్.. హైదరాబాద్ నుంచి షిమ్లా, మనాలీ వెళ్లి వచ్చేయచ్చు..!

-

వేసవి కాలంలో కూల్ టూర్ వేసేయాలి అనుకుంటున్నారా..? అయితే ఈ చల్లని ప్రదేశాలకు వెళ్లి వచ్చేయచ్చు. వేసవి కాలం లో షిమ్లా, మనాలీ లాంటి ప్రదేశాలని చుట్టేసి వచ్చెయ్యచ్చు.
మీరు కూడా ఈ సమ్మర్‌ లో చల్లని ప్రదేశాలకి వెళ్లి వచ్చేయాలంటే ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. వేసవి లో షిమ్లా, మనాలీ టూర్ వేసి వచ్చేస్తే ఎంతో బాగుంటుంది. హ్యాపీ హిమాచల్ పేరు తో ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఇప్పుడు అందుబాటులో ఉంది.

6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఏప్రిల్ 18న ఈ టూర్ మొదలు కానుంది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు షిమ్లా, మనాలీ, చండీగఢ్ వంటి ప్రాంతాలు ని చూసి వచ్చేయచ్చు. మొదటి రోజు హైదరాబాద్‌లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే చండీగఢ్ రీచ్ అవుతారు. అక్కడ నుండి షిమ్లా బయల్దేరాలి. సాయంత్రం మాల్ రోడ్ చూడచ్చు. రాత్రికి షిమ్లా లోనే బస చేయాలి రెండో రోజు కుఫ్రీ సైట్‌సీయింగ్ ఆ తరవాత సాయంత్రం లోకల్ మార్కెట్ చూడచ్చు. రాత్రికి షిమ్లాలోనే బస చేయాలి. మూడో రోజు షిమ్లా నుంచి మనాలీ వెళ్ళాలి.

రాత్రికి మనాలీలోనే ఉండాలి. నాలుగో రోజు మనాలీ సైట్ సీయింగ్. నాలుగో రోజు రాత్రి కూడా మనాలీలోనే ఉండాలి. ఐదో రోజు మనాలీ లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి మనాలీలోనే ఉండాలి. ఆరో రోజు మనాలీ నుంచి చండీగఢ్. రాత్రికి చండీగఢ్‌ లో స్టే చేయాలి. ఏడో రోజు రాక్ గార్డెన్. సాయంత్రం 4.35 గంటలకు చండీగఢ్‌ లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.05 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు. https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version