ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం దేనికైనా భయపడుతోంది అంటే… అది ఒక్క కరోనా వైరస్ కు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మానవ ప్రాణాలతో చెలగాటం ఆదుకున్న మహమ్మారి మళ్ళీ ఇండియాలో మొదలైందని తెలుస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యా పెరుగుంతుండడం తీవ్రంగా ఆందోళన చెందే విషయంగా చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 2151 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ సంఖ్యను చూస్తే 2022 అక్టోబర్ నెలలో నమోదు అయిన కేసుల తర్వాత ఇదే అత్యధికం.
వీటిని కలుపుకుంటే ప్రస్తుతం దేశం మొత్తం మీద ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్యా 11903 కు చేరుకుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్ లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది. ఇందులో ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి, అదే సమయంలో బాధ్యత గల పౌరులుగా బయటకు వెళితే ఖచ్చితంగా మాస్కులు ధరించడం అలవాటు చేసుకోవాలి. లేదంటే మళ్ళీ భారీ నష్టాన్ని చూడవలసి వస్తుంది.