ఇండియాలో ఓమిక్రాన్ కల్లోలం… ఇప్పటి వరకు 3623 కేసులు నమోదు

-

దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా.. దానికి ఓమిక్రానే కారణం అవుతుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వేరియంట్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని 27 రాష్ట్రాలు/ యూటీలకు వ్యాపించింది. రోజురోజుకు వందల సంఖ్యలో కొత్తగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 3623 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 1409 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. అయితే మరోవైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 1.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో కూడా ఎక్కువగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులే అధికంగా ఉంటాయిని పలువురు నిపుణలు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఎక్కువ ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 1009 కేసులు, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే ఎక్కువ ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తొలిసారిగా విదేశాల నుంచి వచ్చిన వారికే ఓమిక్రాన్ సోకేది. కానీ ఇటీవల కాలంలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news