అమెరికాను వణికిస్తున్న కరోనా.. ఒకే రోజులో 6 లక్షల కేసులు

-

అగ్రరాజ్యం అమెరికాను కరోనా అల్లాడిస్తోంది. చాపకింద నీరులా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 6 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 1300 మంది మరణించారు. ఇలా ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. గతంలో ఇండియాలో ఒకే రోజు 4 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటి వరకు ఇదే రికార్డ్ గా ఉండేది. తాజాగా అమెరికా ఈ రికార్డ్ ను తిరగరాసింది. అమెరికాలో కరోనా టెస్టులు చేయించుకునేందుకు జనాలు భారీగా క్యూలో ఉంటున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులే ఉంటున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

దీంతో పాటు యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, యూకేలో ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఫ్రాన్స్ లో 2.06 లక్షల కేసులు రాగా… యూకేలో 1.90 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల్లో నమోదవుతున్న కేసుల్లో ఓమిక్రాన్ ఓరియంట్ కేసులే అధికంగా ఉంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version