రాజకీయ నాయకుల అవినీతి చిట్టా రెడీ: పంజాబ్ సీఎం

-

రాజకీయ నాయకుల అవినీతి జాబితా సిద్ధం చేశామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారికి గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికలు జరుగనున్న సంగ్రూర్ లోక్‌సభ ఆప్ అభ్యర్థి గురైల్ సింగ్ గెలుపు కోసం బర్నాలాలోని బదౌర్‌లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం భగవంత్ హాజరై ప్రసంగించారు.

పంజాబ్ సీఎం

ఈ సందర్భంగా పంజాబ్ సీఎం మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకుల జాబితాను ప్రభుత్వం తయారు చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే కొందరిని జైలుకు పంపించామని, మరికొందరు వారి వంతు కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. వారికి బెయిల్ కూడా లభించకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులను వారే తినేశారన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ అటవీశాఖ మంత్రి సాధుసింగ్ ధర్మసోత్ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version