సిసోడియాకు వారం రోజుల కస్టడీ విధించిన న్యాయస్థానం

-

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో అరెస్టైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. మరో రెండు రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచారణను నేటికీ వాయిదా వేసిన విషయం తెలిసిందే…. మద్యం స్కాంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ సీబీఐ గత వారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న అరెస్ట్ చేసిన మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఈడీ విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం సిసోడియాకు వారం రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు సిసోడియాను నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని ఈడీ కోర్టుకు విన్నవించింది. ఈడీ విజ్ఞప్తికి కోర్టు సమ్మతిస్తూ, సిసోడియాను కస్టడీకి అప్పగించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version