కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్ర‌యల్స్ ఫ‌లితాల వెల్ల‌డి.. 77.8 శాతం ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప్ర‌క‌ట‌న‌..

-

దేశంలో ప్ర‌స్తుతం మూడు కోవిడ్ టీకాల‌ను ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేస్తున్న విష‌యం విదిత‌మే. ఒక‌టి సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ టీకా కాగా, రెండోది భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్(covaxin) టీకా. మూడోది ర‌ష్యాకు చెందిన స్పుత్‌నిక్ టీకా. అయితే కోవాగ్జిన్ టీకాకు గాను భార‌త్ బ‌యోటెక్ శ‌నివారం ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ డేటాను విడుద‌ల చేసింది.

కోవాగ్జిన్/covaxin

భార‌త్ బ‌యోటెక్ విడుద‌ల చేసిన కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ డేటా ప్ర‌కారం ఆ వ్యాక్సిన్ 77.8 శాతం ప్రభావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. ఇక ఈ వ్యాక్సిన్ వాడ‌డం సుర‌క్షిత‌మేన‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు మెడ్ ఆర్ఎక్స్ 4లో ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ వివ‌రాల‌ను ప్ర‌చురించారు.

కాగా నవంబ‌ర్ 16, 2020 నుంచి జ‌న‌వ‌రి 7, 2021 వ‌ర‌కు నిర్వ‌హించిన ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ లో మొత్తం 25,798 పాల్గొన్నారు. అందులో 24,419 మందికి కోవాగ్జిన్ రెండు డోసుల‌ను ఇచ్చారు. ఇక ట్ర‌య‌ల్స్ ప్ర‌కారం డెల్టా వేరియెట్‌పై కోవాగ్జిన్ 65.2 శాతం మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని తేల్చారు.

కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ ను దేశంలోని 25 హాస్పిట‌ల్స్ కేంద్రాలుగా నిర్వ‌హించారు. భార‌త్ బ‌యోటెక్ తోపాటు ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ ట్ర‌య‌ల్స్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా భార‌త్ బ‌యోటెక్ ఎండీ డాక్ట‌ర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ తాము అభివృద్ధి చేసిన మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు అందుబాటులో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. త‌మ వ్యాక్సిన్ కరోనా వైర‌స్‌పై స‌మర్థవంతంగా ప‌నిచేస్తుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version