కొత్త కొవిడ్ కేసుల్లో 46శాతం ఒమిక్రాన్ వేరియంటే

-

దేశ రాజధాని న్యూఢిల్లీలో నమోదవుతున్న కొవిడ్-19 కేసులలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులే 46శాతం ఉంటున్నట్లు తాజా జినోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ద్వారా వెల్లడైందిన ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో న్యూఢిల్లీలో తాజాగా 923 కేసులు నమోదయ్యాయి. గత మే 30 తర్వాత రోజువారీ కేసుల నమోదులో ఇదే అత్యధికం. అంతకుముందు రోజుతో పోలిస్తే కొవిడ్-19 కేసుల నమోదులో 86శాతం పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చిన ఎల్లో అలర్ట్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

న్యూఢిల్లీలో పాజిటివిటీ రేటు 1.29శాతం ఉన్నది. దాదాపు ఆరు నెలల తర్వాత 1శాతానికి పైగా పాజివిటీ రేటు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ 20న దేశ రాజధానిలో కేవలం 90 కేసులు మాత్రమే ఉండగా, బుధవారం 923 కేసులు నమోదు కావడం గమనార్హం.

అంతేకాకుండా ఒమిక్రాన్ కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 238 కొత్త వేరియంట్ కేసులు నమోదుకు అంతుకుముందు రోజు ఈ సంఖ్య 165గా ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version