ఇవాళ్టి నుంచి 24వ సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి వివిధ దేశాలు.. రాష్ట్రాల ప్రతినిధులు రానున్నారు. మహా సభలకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్…ముస్తాబవుతోంది. ఇక ఇవాళ విజయవాడ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టనున్న సీపీఐ…వేల సంఖ్యలో ప్రతినిధులు రానున్నారని అంచనా వేస్తోంది. జాతీయ రాజకీయాలు.. బీజేపీ వ్యతిరేక పోరాటంపై జాతీయ మహా సభల్లో చర్చ జరుగనుంది.
మరోసారి డి.రాజాను సీపీఐ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించే అవకాశం ఉన్నది. అలాగే, సీఎం కేసీఆర్ కూడా ఈ మహా సభలకు హాజరుకానున్నారని తెలుస్తోంది. వామపక్షాల విచ్ఛిన్నం నాటి నుంచి ఐక్యత గురించి సీపీఐ మాట్లాడుతూనే ఉంది…లెఫ్ట్ పార్టీల విలీనం విషయంలో సీపీఐ చొరవ చూపుతున్నా.. సీపీఎం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు సీపీఐ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ ఛైర్మన్ నారాయణ. సీపీఐ-సీపీఎం ఐక్యత కోసం సీపీఐ పార్టీ వైపు నుంచి త్యాగాలు చేశాం.. రాజీ పడ్డాం.. గతంతో పోల్చుకుంటే విలీనం విషయంలో సీపీఎం కొంత అనుకూలంగా ఉంటోందని భావిస్తున్నానని వెల్లడించారు సీపీఐ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ ఛైర్మన్ నారాయణ.