“గో బ్యాక్ స్టాలిన్”.. మొదటి సారి తమిళనాడు సిఎంపై విమర్శలు !

-

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అనంతరం… తనదైన స్టైల్లో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో తన మార్క్ ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సీఎం స్టాలిన్ సత్తా చాటుతున్నారు. మునుపెన్నడూ ఏ సీఎం వ్యవహరించని రీతిలో సీఎం స్టాలిన్… సంచలన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నింపుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయి దాదాపు ఆరు నెలలు గడిచిపోయినా… సీఎం స్టాలిన్ పై ఎలాంటి విమర్శలు రాలేదు.

అయితే తాజాగా సీఎం స్టాలిన్ పై తమిళనాడు రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాలు ఇలాగే వరదలు ఎదుర్కోవడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని ట్విట్టర్ వేదికగా గో బ్యాక్ స్టాలిన్ అనే హ్యాష్ ట్యాగ్ తో విమర్శలు చేస్తున్నారు.

అంతేకాదు… సిమెంట్ బస్తాల ధరలను… మూడు వందల అరవై రూపాయల నుంచి 520 పెంచారంటూ… అలాగే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించ లేదని స్టాలిన్ సర్కార్ పై మండిపడుతున్నారు. తమిళనాడు ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం స్టాలిన్ ఇండియా సిమెంట్ శ్రీనివాస నిర్వహించిన సీఎస్కే పార్టీకి హాజరవుతున్నారని… కార్పొరేట్ కు స్టాలిన్ మొగ్గు చూపుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version