Breaking : నడుం బిగించిన లంకా వాసులు.. ఫండ్ కలెక్ట్‌ చేస్తున్న వైనం…

-

శ్రీలంక ఆర్థిక సంక్షోభ ప‌రిస్థితులు రోజురోజుకు మ‌రింత దారుణంగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు మ‌రింత‌గా ఉధృతం అవుతున్నాయి. 22 మిలియన్ల జనాభా ఉన్నశ్రీలంక లోని ప్రజలు చాలా నెలలుగా బ్లాక్‌అవుట్‌లు మరియు ఆహారం, ఇంధనం, మందుల కొరతతో పోరాడుతున్నారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత దారుణ ప‌ర‌స్థితులు ఇవే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. కాగా, ప్రభుత్వం వద్ద ఇప్పుడు విదేశీ నిధులు కూడా పూర్తిగా అయిపోయాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

అధికారిక డేటా $1.7 బిలియన్ల (reserves at $1.7 billion) వద్ద విదేశీ నిల్వలను చూపుతున్నాయి. అయితే ఆ సంఖ్యలో ఎక్కువ భాగం చైనీస్ కరెన్సీ మార్పిడిని కలిగి ఉందని సమాచారం. ఇదిలా ఉంటే.. తమ దేశాన్ని ఆదుకోవడానికి లంక వాసులు నడుం బిగించారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న శ్రీలంక ఎన్ఆర్ఐలు.. హ్యాష్ ట్యాగ్ శ్రీలంకా పేరుతో ట్వీట్టర్,ఫేస్ బుక్ వేదికగా ఫండ్ కలెక్ట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆందోళనలతో హోరెత్తించిన లంక యువత.. లంకా ఆర్ధిక పునర్ వైభవం కోసం యాక్షన్ రెడి చేస్తోంది. తమ దేశాన్ని కాపాడుకోవడానికి యువతనే ముందుకు రావడం శుభపరిణామమనే చెప్పొచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version