మగవాళ్లను కాలితో తన్నుతూ దాడి చేస్తున్నాయి కాకులు. ఈ సంఘటన సిరిసిల్లా పాత బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్లో కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై దాడి చేస్తున్నాయి కాకులు.
బస్టాండ్ నుండి బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మ పై వాలుతున్నాయి కాకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒకరు.. ఆఖరికి కాకులు కూడా మగవారిని తంతున్నాయని.. మగజాతికి రక్షణ కరువైందని సెటైర్లు వేస్తున్నారు.