ఇన్సూరెన్స్ అంటే..మరణించాక తమ కుటుంబసభ్యులకు ఇచ్చే ఆర్థిక భరోసా..కానీ మనం చాల వార్తలే చూసి ఉంటాం..ఇన్నురెన్స్ డబ్బుకోసం బతికుండగానే చనిపోయినట్లు నాటకం ఆడారు అని, కొన్ని సార్లు సినిమాల్లో కూడా ఈ తరహా సీన్లు పెడతారు..సరిగ్గా ఒక వ్యక్తి ఇలానే చేసాడు. రూ. 23 కోట్ల బీమా సొమ్ముకోసం ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. కానీ అతని ప్లాన్ ఫ్లాప్ అయింది. అసలు ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే..
నిజానికి సెందర్ తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను కంపెనీలు ఆలస్యం చేశాయి. ఓ పక్క కాళ్లుపోయిన బాధ. ఇంకోపక్క బీమా సొమ్మురావట్లేదనే బాధతో.. మనస్థాపం చెందిన సెందర్ తిన్నగా కోర్టును ఆశ్రయించాడు. ఇక్కడే సెందర్ దొరికిపోయాడు. కోర్టు విచారణలో విషయం అంతా బట్టబయలయ్యింది.
పొదుపు ఖాతాల కంటే బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక సలహా అందుకున్న తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. అందుకే పాలసీలు కూడా తీసుకున్నాడట. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టు ముందు సెందర్ చెప్పుకొచ్చాడు.
అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో తాజాగా జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు..కాళ్లుపోయి చేసిన పని అందరికి తెలిసి పరువు కూడా పోయింది.