నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా వివిధ రకాల సైబర్ కేసలు నగరంలో నమోదయ్యాయి. ఆన్లైన్ టైపింగ్ జాబ్ పేరుతో కేటుగాళ్లు ఓ యువతిని మోసం చేసారు. వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్ అంటూ ఆన్లైన్ లో టైపింగ్ జాబ్ ఇస్తామని 1.22 లక్షల మోసం చేశారు. దాంతో కాచిగూడ కి చెందిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు టోపీ పెట్టారు.
దాంతో హైదరాబాద్ కు చెందిన పోశెట్టి అనే బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో వ్యక్తిని 4.15 లక్షల మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.
నగరంలో ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో ఓ వ్యక్తి అమాయకులను మోసం చేస్తున్నాడు. ఇన్సూరెన్స్ పాలసీలు చేసి వాటి మెచ్యూరిటీ డబ్బులతో పాటు డబుల్ పాలసీలు ఇస్తామని అమాయకులను నమ్మించి మోసం చేశాడు.హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ నుండి 45 విడతలుగా 49.16 లక్షల మోసం చేశాడు. డబ్బులు గుంజి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. యువతి ఫిర్యాదుతో నింధితున్ని ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు.