హైదరాబాద్ లో పార్ట్ టైం జాబ్ పేరుతో భారీ మోసం జరిగింది. బాలనగర్ కు చెందిన అనిల్ కుమార్ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అతడికి ఫ్లిప్ కార్ట్ లో పార్ట్ టైం జాబ్ పేరుతో ఓ మెసేజ్ రాగా వారిని సంప్రదించాడు. అనంతరం అతడికి ఓ లింక్ పంపి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా లాభాలు పొందొచ్చని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. దాంతో మొదటి విడతలో రూ.9.67 లక్షలు పెట్టి అనిల్ కుమార్ రిజిష్టర్ అయ్యాడు. అనంతరం నగదు విత్ డ్రా చేసుకునేందుకు రూ.3.31 లక్షల నగదు తో రీఛార్జి చేయాలని మరో మహిళ ఫోన్ చేసి సూచించింది.
హైదరాబాద్ : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో 13 లక్షలు స్వాహా..!
-