వావ్‌.. తల్లికోసం చంద్రమండలంపై భూమి కొన్న కూతురు

-

చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడింది. ఆ ప్రాంతాన్ని శివశక్తి అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్‌లో ఉంది. చంద్రుడిపై మానవ మనుగడ కోసం నిరంతరం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ తన తల్లికి చంద్రునిపై భూమి కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ చంద్రయాన్-3 ప్రయోగం చేసిన రోజు పూర్తి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో నివాసం ఉండే సింగరేణి కార్మికుడు సుద్దాల రాంచందర్‌, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె సాయి విజ్ఞత ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడింది. అక్కడి గవర్నర్‌ కిమ్‌ రెనాల్డ్స్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంది. అమెరికా వెళ్లినప్పటి నుంచి ప్రతి ఏడాది మాతృ దినోత్సవం నాడు తన తల్లికి ఏదో ఒక కానుక పంపిస్తూ ఉండేది. కానీ అది సాయి విజ్ఞతకు సంతృప్తిని ఇవ్వలేదు. తనను నవమాసాలు మోసి కన్న తల్లికి ఏదైనా అరుదైన కానుక ఇవ్వాలని పరితపించిపోయింది. ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వనటువంటి గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో.. 2022లో చంద్రుడిపై స్థలాలను అమ్ముతున్నట్లు తెలుసుకుంది. లూనార్‌ ల్యాండ్‌ రిజిస్ట్రీ అనే సంస్థ చంద్రుడిపై స్థలాలను అమ్మకానికి పెట్టడంతో వెబ్‌సైట్‌ను చూసిన ఆమె మరుక్షణం ఆలోచించకుండా తన తల్లి వకుళాదేవి, కుమార్తె ఆర్హ పేరు మీద ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఉంచింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version