ఇండియాతో జరగబోయే రెండవ టెస్టుకు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గార్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. దీంతో టెస్టులకు ఎల్గార్ గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇదే అతని చివరి టెస్ట్ మ్యాచ్. ఇండియాతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తొడ కండరాలు పట్టివేయడంతో బ్యాటింగ్ కి రాలేకపోయాడు. ఇక అతని స్థానంలో టెస్టులకి గుడ్ బై చెప్పబోతున్నటువంటి ఎల్గార్ సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.2021-2022 లో ఇండియా సౌత్ ఆఫ్రికాలో పర్యటించినప్పుడు అతని కేఫ్టెన్సీలో 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది.
సెంచరీయన్ లో ఇండియాతో జరిగిన తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో గెలుపు పొందిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 245 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన సౌత్ ఆఫ్రికా 408 పరుగులు చేసింది.తొలి టెస్టులో డీన్ ఎల్గార్ 185 పరుగులు చేశాడు.