ట్రెండ్ సెట్ చేసిన దీపికా పదుకొనే..ఓల్డ్ శారీలో బ్యూటిఫుల్ లుక్స్

-

బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనె..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. గ్లామర్ వరల్డ్ అయిన ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది.
‘చపాక్’ ఫిల్మ్ లో డీ గ్లామర్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ తో మ్యారేజ్ తర్వాత ఈ భామ మరిన్ని క్రేజీ ప్రాజెక్స్ట్ చేస్తోంది.

ప్రయోగాలకు కేరాఫ్ గా నిలుస్తోంది దీపికా. ఇకపోతే ఈ సుందరి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో నలుపు రంగు చీర స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించిన ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘నయా ట్రెండ్ బాగుందండీ’’ అని అంటున్నారు. ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీపికా పదుకొనే..ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ ప్రాజెక్ట్ K’, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఫిల్మ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘ప్రాజెక్ట్ -కె’తో ఈ సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version