తెలంగాణ లో డెంగీ కేసులు పెరుగుతున్నాయని.. జిహెచెంసి పరిధిలోనే యాబై శాతం డెంగీ కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్యశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రోజు 15 వందల మందికి డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది తెలంగాణ వైద్యశాఖ. కోవిడ్ తెలంగాణ లో అదుపులో ఉందని.. అన్ని జ్వరాలు కోవిడ్ అనుకోవద్దని పేర్కొంది.
సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల భాగస్వామ్యం అవసరమని వెల్లడించింది. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వందకు పైగా మలేరియా కేసులు నమోదు నమోదయ్యాయని.. పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ ప్రబలుతుందని వెల్లడించింది తెలంగాణ వైద్యశాఖ.
హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని.. హైదరాబాద్ లో 447 డెంగ్యూ కేసులు, ఖమ్మం లో 134 కేసులు, రంగారెడ్డి లో 110 కేసులు నమోదు అవుతున్నాయని స్పష్టం చేసింది. గత ఏడాది కేవలం 2 వేల డెంగీ కేసులు నమోదు కాగా ఈఏడాడి ఇప్పటికే 12 వందల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ లో మళ్ళీ ఫీవర్ సర్వే నిర్వహిస్తామని.. ప్రతి కుటుంబం డ్రై డే ఫాలో కావాలని పేర్కొంది తెలంగాణ వైద్యశాఖ.