గోళ్ల చుట్టూ చర్మాన్ని కొరికే అలవాటుందా..? అది వ్యాపకం కాదు వ్యాధి

-

కొందరికి వద్దన్న పని చేయటంలోనే ఎక్కడ లేని మజా ఉంటుంది. చిన్నప్పటి నుంచి గోళ్లు నోట్లో పెట్టుకుని కొరకొద్దని ఇంట్లో వాళ్లు చెప్తూనే ఉంటారు.. అయినా ఇప్పటికీ.. చాలామందికి ఈ అలవాటు పోదు. పరధ్యానంలో అలా గోళ్లు కొరుక్కోవడం చాలా మందికి అలవాటే. ఇంకొందరు..ఆ గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కొరుకుతుంటారు. ఇది ఒక రకమైన వ్యాధి అంటున్నారు వైద్యులు.. ఈరోజు మనం ఈ అంశంపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా..!

తరచుగా, గోర్లు లేదా గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కొరకడం అనే అలవాటును డెర్మటోఫాగియాగా (Dermatophagia) పేర్కొంటారు. ఈ సమస్యను బాడీ ఫోకస్డ్‌ రిపిటీటివ్‌ బిహేవియర్‌గా చెబుతారు. గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని క్యూటికల్స్ వరకు కొరికేలా చేస్తుంది.

డెర్మటోఫాగియా లక్షణాలు ఏవి?

ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తులు తమ చేతులకు ఏమి చేస్తున్నారో గ్రహించకుండా వారి గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని నిరంతరం కొరుకుతారు. గోళ్ల చుట్టూ గాయాలు, పగిలిన, లేదా రంగు మారిన చర్మం కనిపిస్తుంది. అందువల్ల ఈ సమస్య తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.

కారణమేమిటి?

దీనికంటూ పెద్దగా ఏం కారణాలు ఉండవు. కొందరు వ్యక్తులు కేవలం ఏదైనా ఆలోచనలో పరధ్యానంగా ఉన్నప్పుడు ఈ పని చేస్తుంటారు. కొందరు ఒత్తిడి/ఆందోళన లేదా ఇతర కారణాల వల్ల అలవాటు చేసుకుంటారు.

చికిత్స ఉందా?

డెర్మటోఫాగియా చికిత్సకు మార్గాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా హ్యాబిట్ రివర్సల్ ట్రైనింగ్ వంటి థెరపీలను వాడొచ్చు. కొన్ని సందర్భాల్లో మందులు కూడా పని చేసే అవకాశం ఉంటుదట. అయితే ఈ సమస్యను గుర్తించినవెంటనే.. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎక్కువ ఆలస్యం చేస్తే.. మన ఆరోగ్యానికే ప్రమాదం..

ఇదేనే కాదు.. చాలామంది.. గోర్లు కూడా.. నోటితోనే తీసేస్తుంటారు. మనకు తెలియని కొన్ని వేల క్రిములు గోళ్లలో ఉంటాయి. వాటిని మీరు పోయి పోయి నోట్లో పెట్టేసుకుంటారు. దాని వల్ల అవి సీదా కడుపులోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. వారానికి ఒకసారి..నెయిల్‌కట్టర్‌తోనే గోళ్లు కత్తిరించుకోవడం మంచి పద్దతి.!

Read more RELATED
Recommended to you

Latest news