పాకిస్తాన్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ ఆలయంలో దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కోరంగి నంబర్-5 ప్రాంతంలో చోటు చేసుకుంది. శ్రీ మరిమాత ఆలయంలోని విగ్రహాలను బుధవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానిక హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బుధవారం రాత్రి ఆరు నుంచి ఎనిమిది మంది దుండగలు బైక్‌పై ఆలయానికి వచ్చినట్లు స్థానికుడు తెలిపాడు. గత కొద్ది రోజులుగా పాక్‌లోని హిందూ ఆలయాలే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. అక్టోబర్ నెలలో సింధు నది ఒడ్డున ఉన్న ఓ చారిత్రాత్మక ఆలయంపై దాడులు జరిగాయి. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పాకిస్తాన్‌లో 7.5 మిలియన్ల హిందువులు నివసిస్తున్నారు. పాకిస్తాన్‌లోని హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధు ప్రావిన్స్ లో స్థిరపడ్డారు. దీంతో చాలా మంది హిందువులు ఆందోళన చెందుతున్నారు.
Once again #MinoritiesTargeted in #Pakistan. ncident of vandalism against places of worship of the #Hindu community in #Pakistan, the statues of deities at Shri Mari Maata in #Karachi’s Korangi area is attacked.#AntiPakistanARY #BabarAzam𓃵 #DuaZehra #MandirVandalised #TeJran pic.twitter.com/YYSChPdFke
— Anu Radha (@anu_financial) June 9, 2022