ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. రోడ్ షో కొనసాగుతుండగానే ఓ దుండగుడు ఆకస్మాత్తుగా రాయి విసరాడు. దీంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని టిడిపి ఆరోపిస్తోంది.
తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కాన్వాయ్ పై రాళ్ల దాడిపై అనుమానాలు ఉన్నాయన్నారు దేవినేని ఉమ. నిందితులకు బెయిల్ వచ్చేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణం అన్నారు. నిందితులకు సహకరించేలా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు దేవినేని ఉమ. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యంతో ఏపీని అధోగతి పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.