డీజీసీఏ కీలక నిర్ణయం… అంతర్జాతీయ విమానాల సర్వీసులపై నిషేధం కొనసాగింపు…

-

అంతర్జాతీయ విమానాలకు మరోసారి బ్రేక్ పడింది. ఈనెల 15 నుంచి రెగ్యులర్ అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలనుకున్న కేంద్రం.. ప్రస్తుతం ఆనిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇటీవల కాలంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తీవ్రత పెరగుతున్న నేపథ్యంలో డీజీసీఏ( డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏయిర్ బబుల్ ఆంక్షల మధ్య 28 దేశాలకు మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులకు నిషేధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్దరణ గురించి మళ్లీ సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డీజీసీఏ రెగ్యులర్ విమాన సర్వీసులను ప్రారంభించే విషయంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి ఏ తేదీన ప్రారంభిస్తారనే విషయాన్ని తెలపలేదు.

ప్రస్తుతం కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ‘అట్-రిస్క్’గా గుర్తించబడిన దేశాలలో యూరోపియన్ దేశాలు, యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయెల్ మరియు హాంకాంగ్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వస్తే బాధితుడిని ఐసోలేషన్కు పంపి శాంపిళ్లను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version