రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు : డీజీపీ అంజనీకుమార్‌

-

మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో డీజీపీ అంజనీకుమార్‌ యాదవ్‌ శుక్రవారం మొక్క నాటారు. అనంతరం సీసీ కెమెరాల నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ పోలీసు గర్వకారణమని, కేసుల దర్యాప్తులో సాంకేతిక వినియోగంలో ముందంజలో ఉన్నామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు జరిగాయన్నారు.

సిటీజన్‌ సెట్రిక్‌ పోలీసింగ్‌, సిటీజన్‌ ఫ్రెండ్లీ పోలిసింగ్ సమర్దవంతంగా అమలు అవుతుందని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పటిష్ట భద్రత అమలవుతుండటంతో బహుళ జాతి సంస్థలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర ఎన్నో సంస్థలు పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పోలీసులు పౌరులకు ఉన్నతంగా సేవలందిస్తున్నారని తెలిపారు. తగిన శిక్షణతోనే ఉత్తమంగా పోలీసులు సేవలందిస్తారన్న ఉద్దేశంతో శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 28 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని శిక్షణా కేంద్రాల్లేవని ఆయన చెప్పారు. రాష్ట్రం పోలీసులు ప్రజలకు ఉత్తమంగా సేలందించేందుకు, నేరాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని డీజీపీ చెప్పారు. నిరంతరం నిఘా కోసం విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version