ధంతేరాస్ ఎఫెక్ట్.. భారత్‌కు లక్ష కిలోల బంగారం

-

దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు రూ.76వేలకు పైగా పలికిన ధర ఉన్నట్టుండి ధంతేరాస్ ఎఫెక్ట్ కారణంగా రూ.81,400కు బంగారం ధర చేరుకుంది. ఇండియాలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంది. ఏ చిన్న అకేషన్ వచ్చిన బంగారం తీసుకోవడం భారతీయ మహిళలకు ఆనవాయితీగా మారింది. అలా చేస్తే లక్ష్మీదేవి కరుణకటాక్షాలు ఉంటాయని ఇక్కడి మహిళలు నమ్ముతుంటారు. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నా దేశంలో డిమాండ్ తగ్గడం లేదు.

ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఏకంగా లక్ష కిలోల బంగారాన్ని భారత సర్కార్ గుట్టు చప్పుడు కాకుండా దేశానికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. మే 31న 100 టన్నుల బంగారాన్ని నాగ్‌పూ‌ర్‌కు కేంద్రం తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఓఈ, బీఐఎస్ వద్ద 324 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version