రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన క ర్నూలు జిల్లా రైతు

-

అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలోని ఓ రైతుకు జరిగింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి కళకళలాడిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో జొన్నగిరి రైతుల్లో ఒకరిద్దరైనా రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఆ మట్టిలో విలువైన వజ్రాలు దాగి ఉండడమే అందుకు కారణం. వర్షం కారణంగా మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. అందుకనే ఒక్క జొన్నగిరి వాసులు మాత్రమే కాదు.. చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచి కూడా వచ్చి జొన్నగిరిలో వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు.

A quadrillion ton of diamonds found buried in the Earth's crust • Earth.com

తాజాగా, పొలంలో పనిచేసుకుంటున్న జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం అతడిని లక్షాధికారిగా మార్చింది. నిన్న ఉదయం పొలంపని చేసుకుంటున్న రైతు చేతికి ఓ వజ్రం చిక్కింది. విషయం తెలిసిన ఓ వ్యాపారి దానిని రూ. 25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

 

Read more RELATED
Recommended to you

Latest news