2014లో కూడా చంద్రబాబు నాయుడు అనే పశుపతి 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అనేక హామీలిచ్చి మోసం చేశారని సీఎం జగన్ మండిపడ్డారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ…’చంద్రబాబు, పవన్, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ముఖ్యమైన హామీలంటూ ఊదరగొట్టారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ చేశారా? అర్హులైన అందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? ఆడబిడ్డలు పుట్టిన వెంటనే రూ.25వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇచ్చారా?’ అని ప్రజలను ప్రశ్నించారు.
అంతేకాక మేనిఫెస్టోలో మరో 650 హామీలు ఉన్నాయి, కానీ ఎన్నికల అయిపోగానే మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్టలో పడేశాడని విమర్శించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ కలిసి.. నన్ను ఓడించడానికి ఏకమవుతున్నారన్నారు అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తురాదని.. అదే జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయన్నారు.