ఫ్యాక్ట్ చెక్: భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమాదాస్‌ నిజంగానే బంగారు పథకం గెలిచిందా? నిజమేంటి?

-

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ తొలి పతకం అందుకుంది. వెయిట్‌ లిఫ్టర్‌ సంకేత్‌ మహాదేవ్‌ సర్గార్‌ రతజం సాధించాడు. వెయిట్​లిఫ్టింగ్​లో 55 కేజీల సెగ్మెంట్‌లో సంకేత్ మహదేవ్‌​ సార్గర్​ సిల్వర్ మెడల్ సాధించాడు.. మొత్తంగా 248 కిలోలు ఎత్తి కామన్​వెల్త్ ​గేమ్స్ ​లో భారత్​ బోణీ కొట్టేలా చేశాడు. ఈ విభాగం లో మలేషియా వెయిట్ లిఫ్టర్ అనిక్​ కస్డాన్​ మొత్తం 249 కిలోలు ఎత్తి గోల్డ్ సిల్వర్ దక్కించుకోగా.. కాగా,లంక కు చెందిన దిలంక కుమారా 225 కిలోల బరువు లిఫ్ట్ చేసి కాంస్య పతకం సాధించాడు.

అయితే ఇక్కడి వరకు ఓకే గానీ భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమాదాస్‌ 400 మీటర్ల రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.ఈ విషయం పై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. కొన్ని ప్రముఖ చానెల్స్ ఆమె స్వర్ణ పథకం గెలుచుకోలేదని, అందులో నిజం లేదని ప్రచారం చేస్తున్నాయి. ఆ వీడియో ఇప్పటిది కాదు..2018 ది అని ఓ వార్త చక్కర్లు కొడుతోంది..

అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసిన అనంతరం ఈ వార్త పూర్తిగా ఫేక్ అని నిర్దారించడమైనది. నిజం చెప్పాలంటే హిమాదాస్‌ పార్టిసిపేట్ చేయాల్సిన 400 మీటర్ల రేస్ ఆగస్టు 6న షెడ్యూల్ చేయబడింది. అంతర్జాతీయ క్రీడల్లో ఆమె భారత్‌కు ఎన్నో పతకాలు అందించింది. అంతర్జాతీయ ట్రాక్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. కామన్వెల్త్‌లోనూ ఆమె పతకం గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు… ప్రస్తుతం ఈ వార్త వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఆ ట్వీట్ పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news