విద్యార్థులకు అలర్ట్‌.. రేపే టీఎస్‌ ఈసెట్‌

-

టీఎస్‌ ఈసెట్‌ ఈ నెల 1న నిర్వహించనున్నట్టు కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 24,055 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు విజయ్‌కుమార్‌ రెడ్డి. మొత్తం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు విజయ్‌కుమార్‌ రెడ్డి.

Ts Ecet 2022: Jntu Postpones Examination @ecet.tsche.ac.in Citing Heavy  Rain In Telangana: Results.amarujala.com

విద్యార్థులకు పాత హాల్‌టికెట్ల స్థానంలో కొత్తవి జారీ చేశామని వెల్లడించారు విజయ్‌కుమార్‌ రెడ్డి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్‌ సైన్స్‌, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ అభ్యర్థులకు పరీక్ష ఉంటుందన్నారు విజయ్‌కుమార్‌ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, మైనింగ్‌, మెటలర్జీ, ఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు విజయ్‌కుమార్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news