ఈటల రాజేందర్ అంటే తెలంగాణ రాజకీయాల్లో ఓటమి ఎరగని నేత. ఆయన రెండు దశాబబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా గెలుస్తూ చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు ఆయనకు సుపరిచితమే. మరి అలాంటిది ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో నియోజకవర్గ ప్రజల మనోభావన ఎలా ఉందనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే. మరి వారి అభిప్రాయం కూడా ఈటల తీసుకునే ఉంటారు. మరి వారేమన్నారో తెలుసా.
ఈటల రాజీనామాపై నియోజికవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ ఈటల రాజీనామా చేస్తే ప్రజలెందుకు సంతోషిస్తారనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ అసలు ట్విస్టు ఏంటంటే? నియోజకవర్గంలోని ఎన్నో సమస్యలు చాలా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీతో అవన్నీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా తీరే అవకాశం ఉంది.
ఉప ఎన్నిక ఎక్కడ వచ్చినా ఆ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తుంటారు సీఎం కేసీఆర్. అలాగే అక్కడ ఉన్న సమస్యలు దాదాపు పరిష్కరిస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. మొన్న నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ఎన్ని వరాలు కురిపించారో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అన్ని రకాల సమస్యలు ఎన్నికలకు ముందే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ కారణంతో అటు ఈటల, ఇటు ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పాలి.