విశ్వవిఖ్యాత గా అప్పటికీ , ఇప్పటికీ , ఎప్పటికీ మరిచిపోలేని మహోన్నత వ్యక్తిగా.. సమ్మోహనశక్తి గా.. నట సార్వభౌముడు గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి తారకరామారావు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఇక ఈ రోజు ఆయనకు తమ కుటుంబ సభ్యులు 100వ పుట్టిన రోజు కాబట్టి.. శతజయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారకరామారావు. ఇకపోతే ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కొన్న ఇంటిలో సూర్యనారాయణ అనే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి అద్దెకు ఉండే వారు. ఆ తర్వాత సూర్యనారాయణ బిజినెస్ కోసం ముంబై వెళ్ళగా ఆయనను వ్యాపార భాగస్వాములు మోసం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న లక్ష్మయ్య చౌదరి సూర్యనారాయణకు సహాయం చేయాలని సీనియర్ ఎన్టీఆర్ ను ముంబై కి పంపించారు. అప్పుడు ఎన్టీఆర్ ముంబైలో కోర్టుకు అవసరమైన అన్ని పత్రాలను అందించి సూర్యనారాయణను నిర్దోషిగా విడుదల అయ్యేలా చేశారు. ఇక అక్కడే సీనియర్ ఎన్టీఆర్ మెస్ ఏర్పాటుచేసి డబ్బు ఆర్జించే వారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి కి ఎన్టీఆర్ మెస్ ను నడపడం ఇష్టం లేకపోవడం వల్లే ఎన్టీఆర్ ఆ మెస్ ను వదిలేశారు. ఆ తర్వాత బబ్బూరి వెంకయ్య అనే వ్యక్తి తో కలసి సీనియర్ ఎన్టీఆర్ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. అయితే వెంకయ్య చనిపోవడం వల్ల ఆ వ్యాపారానికి ఎన్టీఆర్ కూడా స్వస్తి పలికారు.
ఇక సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ నడపగా నష్టాలు రావడంతో ఆ వ్యాపారానికి కూడా ఎన్టీఆర్ దూరమయ్యారు. అంతేకాదు ఎన్టీఆర్ బిఏ చదువుతున్న సమయంలో ఎయిర్ ఆఫీసర్ జాబుకు ఎంపికయ్యారు. అయితే భార్యకు ఇష్టం లేదని ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కు సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం వచ్చింది కేవలం 11 రోజుల పాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత సినిమాల్లో అవకాశం కోసం వెళ్ళిపోయారు.అలా తన కెరీర్ విషయంలో ఆయన వెనుతిరిగి చూడలేదు.