వాషింగ్ మెషీన్‌లో ఇవి కూడా వేయొచ్చు తెలుసా..?

-

వాషింగ్ మెషీన్‌లో బట్టలు మాత్రమే కాదు.. ఇంకా చాలా వేసి క్లీన్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈ విషయం తెలియక.. వాటిని చేతులతో ఉతుక్కోని.. కష్టపడుతుంటారు. దీని వల్ల టైమ్ కూడా వేస్ట్ అవుతుంది. అవును ఏది పడితే అది వాషింగ్ మెషిన్ లో వేస్తే.. మెషిన్ పాడవుతుందని చాలామంది అనుకుంటారు.. ఆ భయంతోనే.. బట్టలు తప్ప కనీసం.. బరువైన దుప్పట్లు కూడా వేయడానికి జంకుతారు. ఈరోజు మనం వాషింగ్ మెషీన్‌లో బట్టలతో పాటు.. ఇంకా ఏం ఏం వేయొచ్చో చూద్దామా..!
చైర్ కుషన్.. రెండు మూడు సీజన్ల తర్వాత మీ కుర్చీ కుషన్ మురికిగా మారితే, మీరు వాటిని వాషింగ్ మెషీన్‌లోని చల్లటి నీటితో శుభ్రం చేయవచ్చు. వాటిని సున్నితమైన మోడ్‌లో గాలిలో ఆరబెట్టుకోవచ్చు.
కార్ మాట్స్ ను.. వాషింగ్ మెషీన్లో సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. నిజంగానే అవి చేతితో శుభ్రం చేయడం కంటే మెషిన్‌లో సులభంగా శుభ్రం అవుతాయి. కొత్తవిగా కూడా కనిపిస్తాయి.
రబ్బర్ బ్యాక్ రగ్గులు ,మ్యాట్‌.. ముందుగా వాక్యూమ్ క్లీనర్ సహాయంతో వీటిని పూర్తిగా శుభ్రం చేసి, ఆ తర్వాత వాషింగ్ మెషీన్‌లో శుభ్రం చేసుకోవచ్చు. ఇవి సులభంగా శుభ్రం అయిపోతాయి.
యోగా మ్యాట్ ను కూడా వాషింగ్ మెషీన్‌లో వేసుకోవచ్చు. క్లీన్ చేసి నీడలో ఆరబెట్టుకోవాలి.
గది శుభ్రం చేసే తుడుపుకర్ర.. ఇది కూడా చాలా మురికిగా ఉంటుంది. ఇంకా తడిస్తే విపరీతమైన బరువు ఉంటుంది. దీన్ని కూడా కర్ర నుంచి క్లీన్ చేసేది వేరు చేసి.. మెషీన్‌లో వేయొచ్చు.
మీరు బాత్రూంలో ఫర్రి బాత్ మ్యాట్‌ని ఉపయోగిస్తే, మీరు వాటిని మెషీన్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు.
 పిల్లల బొమ్మలు, ముఖ్యంగా మృదువైన బొమ్మలు, చాలా త్వరగా మురికి అవుతాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు నోటి దగ్గర కూడా చాలాసార్లు పెట్టుకుంటారు. కాబట్టి వాటిని తరచుగా శుభ్రం చేయాలి. వీటిని కూడా వాషింగ్ మెషీన్లో శుభ్రం చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version