రాహుల్ యాత్ర‌కు ఆహ్వానం అంద‌లేదు – అఖిలేష్ యాద‌వ్

-

వచ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్ధుబాటు స‌హా ఇత‌ర అంశాల్లో ప్రతిపక్ష ఇండియా కూట‌మిలో చిచ్చు రేగిన నేప‌ధ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌కు సంబంధించి త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ఆహ్వానం అంద‌లేద‌ని తెలిపారు. ఆహ్వానం కోసం తామెందుకు వేచిచూడాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాహుల్ యాత్ర ప్ర‌స్తుతం జార్ఖండ్‌లో సాగుతుంది. ఉత్తర ప్రదేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల మీదుగా వెళుతూ ముంబైలో ముగియ‌నుంది. రాహుల్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ప్ర‌వేశిస్తే మీరు హాజ‌ర‌వుతారా అని ప్ర‌శ్నించ‌గా అఖిలేష్ ,దానికి బదులిస్తూ ఎన్నో భారీ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నా త‌మ‌కు ఆహ్వానాలు అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. ఆహ్వానం కోసం తాము ఎందుకు అడ‌గాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.కాగా భార‌త్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ధ‌న్‌బాద్ గుండా జార్ఖండ్‌లోకి ప్ర‌వేశించింది. ఈ యాత్ర ఫిబ్ర‌వ‌రి 14న ఉత్తర ప్రదేశ్ లో ఎంట‌ర‌వ‌నుంది. రాహుల్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version