డీజిల్ ట్యాంకర్ బీభత్సం..హైదరాబాద్-విజయవాడ హైవేపై బ్లాక్

-

ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారిపై వేగంగా దూసుకొచ్చిన డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీపై ఉన్న డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించిన లారీ డ్రైవర్ వెంటనే బయటకు దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. మంటల ధాటికి లారీ పూర్తిగా దగ్ధమైంది.

వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, దట్టమైన పొగతో పాటు మంటలు భారీగా చెలరేగడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దగ్ధమైన లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version