“కేజిఎఫ్ 2 ” సినిమాపై డైరెక్టర్ శంకర్ ప్రశంసల వర్షం

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్2 సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కేజిఎఫ్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే తాజాగా డైరెక్టర్ శంకర్ కేజిఎఫ్ 2 చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు.

శంకర్ కేజిఎఫ్ 2 చిత్రంపై స్పందిస్తూ.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, డైలాగ్స్, యాక్టింగ్ అన్ని కూడా ఈ సినిమాలో బాగున్నాయని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కేజిఎఫ్ 2 సినిమా గురించి శంకర్ చేసిన పోస్ట్ కు రిప్లై గా ప్రశాంత్ నీల్ స్పందించారు.. తన సినిమాను గురువులాంటి శంకర్ ప్రశంసించడం ఎంతో ప్రత్యేకం అని దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్ ‘ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version