అప్పుడే బాలయ్య 109వ మూవీ పై చర్చలు మొదలు.. డైరెక్టర్ ఎవరంటే..?

-

నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా తారకరత్న ఆరోగ్య రీత్యా ఆయన సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.. సాధారణంగా బాలయ్యతో సినిమాలు అంటే పవర్ఫుల్ కంటెంట్, మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్ , డాన్స్ , ఫైట్స్ , సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ , ఆక్షన్ సీన్స్, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఇలా ఇండస్ట్రీ రికార్డు తిరగరాయాలంటే ఒక నందమూరి బాలకృష్ణ కే సాధ్యమని పలు సందర్భాలలో బాలయ్యతో చేసిన డైరెక్టర్లు తెలిపారు..

ఈ క్రమంలోనే సింహ సినిమాతో మొదలైన సక్సెస్ జోరు వీరసింహారెడ్డి సినిమా వరకు కంటిన్యూ అవుతుంది.. ఇకపోతే సింహ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకొని మరి సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటేనే ప్రేక్షకుల అంచనాలు పెరిగేలా చేసుకున్నారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ వచ్చిన లెజెండ్, అఖండ సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి సినిమా చేసిన బాలయ్య, అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు.. అయితే ఈ సినిమా అయిన వెంటనే ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.. మరి ఇంతకా ఆ డైరెక్టర్ లు ఎవరు అంటే? వీరిలో మొదటి పేరు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు వినిపిస్తోంది. మరొకవైపు బోయపాటి శ్రీను, క్రిష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్ గా వీరి ముగ్గురిలో ఎవరో ఒకరికి ఆయన ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో వుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version