వర్షాకాలంలో మనుషులకు వ్యాధులు వచ్చినట్లు,పక్షులకు,జంతువులకు కూడా వ్యాధులు వస్తాయన్న విషయం తెలిసిందే.ఇప్పుడు వర్షాకాలంలో కోళ్లకు వచ్చే వ్యాధులు మరియు వాటి నివారణ గురించి వివరంగా తెలుసుకుందాం..
కోళ్ళ మశూచి :
కోళ్ళ అంటువ్యాధుల్లో ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన గ్రుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం లేదా కోళ్ళు చనిపోవుటం జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద, తుమ్మెలకు, కనురెప్పల చుట్టు పోక్కులు ఏర్పడతాయి. అప్పడుప్పడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. ఇవి 6-7 వారాల వయస్సులో మరలా 16-17 వారాల మధ్య వేయాలి.
ఎశ్చరీషియా కొలై :
బ్రాయిలర్ పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రంగా వస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధితో బ్రాయిలర్స్‌లో బరువు సరిగ్గా రాకపోవడం వల్ల నష్టం వాటిలుతుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నీరసంగా ఉండి మేత సరిగా తినకపోవడం జరుగుతుంది. మరణించిన కోడి పిల్లల ప్రేగులు ఉబ్బి ఉంటాయి. యాంటిబయోటిక్స్ మందులు మేతలో మరియు నీటిలో వాడితే ఈ వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు. తాగు నీటితో పాటు సేనిటైజర్ మందును కోళ్ళకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చు..
కొరైజ :
కోడి పిల్లలు సరిగా నీటిని, మేత తీసికొనక బరువును కోల్పోతాయి. ముక్కునుండి, కళ్ళనుండి నీరు కారుట రోగ లక్షణాలు. కళ్ళల్లో ఉబ్బి తెల్లని చీము గడ్డలుగా తయారవుతాయి. మరణసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశించిన, అన్ని బ్యాచ్లకు ఈ రోగం వస్తూనే ఉంటుంది. ఒక బ్యాచ్లో ఈ వ్యాధి వచ్చినప్పడు కొద్ది రోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లో లాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కలిపి జల్లివేయాలి. లిట్టరు ఎల్లప్పడు పొడిగా ఉండేలా చూడాలి. రోగం సోకిన పిల్లలకు యాంటిబయాటిక్ మందులు విటమిన్ల తో కలిపి వారం రోజులు వాడాల్సి ఉంటుంది.. అప్పుడే తగ్గిపోతుంది..
పుల్లోరం:
చిన్న పిల్లలు ఎక్కువగా గురికాబడతాయి. ఈ వ్యాధి తల్లి నుండి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడటం, భారంగా శ్వాసతీయడం, రెక్కలు వాల్చడం గమనించవచ్చు. తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. గుండె, గిజర్డ్, కాలేయం మరియు పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయాటిక్ మందులు వాడాలి…వీటితో పాటు వాటికి కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..
వీటితో పాటు రానికెట్ రోగం,రక్త పారుడు రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..ఏదైనా కోడి మెత్తగా వుంటే వాటిని వెంటనే వైద్యులు చూపించి మందులను వాడటం మంచిది..లేకుంటే మిగిలిన కోళ్లకు కూడా వ్యాధులు వ్యాపించి చనిపోయే ప్రమాదం వుంది…