ఎడిట్ నోట్: కారులో కలవరం…!

-

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి…ఎప్పుడు ఏ పార్టీకి లీడ్ ఉంటుందో అర్ధం కాకుండా ఉంటుంది…ఉండటానికి అధికారంలో టీఆర్ఎస్ ఉన్నా సరే…ఇటీవల ఆ పార్టీలో పెద్ద జోష్ కనిపించడం లేదు…అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లో కూడా ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సొంత పార్టీలోనే లుకలుకలు ఎక్కువ ఉన్నాయి. దీని వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా ఊపు కనిపించడం లేదు.

ఇక తెలంగాణలో మంచి ఊపు మీదున్న పార్టీ బీజేపీ మాత్రమే…గత ఏడాది కాలం పైనుంచి రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది…అసలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకెళుతుంది. రోజురోజుకూ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంటే…టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుంది…ఇక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందో లేదో కూడా సరిగ్గా క్లారిటీ ఉండటం లేదు. ఆ పార్టీది చాలా వింత పరిస్తితి కనిపిస్తోంది…ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ విషయం పక్కన పెడితే…రాష్ట్రంలో కారు-కమలం పార్టీల మధ్యే పెద్ద వార్ నడుస్తోంది..ఈ రాజకీయ యుద్ధంలో బీజేపీనే ముందు ఉన్నట్లు కనిపిస్తోంది…ఆ పార్టీ …అన్నివైపులా కేసీఆర్ సర్కార్ పై రాజకీయంగా దాడి చేస్తుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్తితి. ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పెద్ద యుద్ధమే చేస్తుంది. అదే సమయంలో బండి సంజయ్ పాదయాత్ర బీజేపీకి బాగా ఊపు తీసుకొస్తుంది.

ఇక కేంద్రం పెద్దలు కూడా తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉందంటే…అది వలసలు. ఇంతకాలం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలని, నాయకులని టీఆర్ఎస్ లాగేసుకుంది. అలా నాయకులని లాగేసుకుని టీఆర్ఎస్ బలోపేతమైంది. లేదంటే టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో పెద్ద బలం లేదు…2014 ఎన్నికల్లోనే 63 సీట్లు గెలుచుకుని బొటాబోటి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలని, నాయకులని లాగేసి టీఆర్ఎస్ బలపడింది.

ఇప్పుడు అదే ఫార్ములాతో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది…ఓ వైపు కాంగ్రెస్ నేతలని లాగుతూనే…మరోవైపు టీఆర్ఎస్ పై పూర్తిగా దృష్టి పెట్టింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన 10-12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బండి చెబుతున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సైతం…అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీంతో టీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది..అసలు బీజేపీతో టచ్ లో ఉన్నది ఎవరు? వారు ఎప్పుడు బయటకెళ్లిపోతారు? అనే టెన్షన్ టీఆర్ఎస్ అధిష్టానంలో ఉంది. అయితే రివర్స్ లో టీఆర్ఎస్ నుంచి వలసలు మొదలైతే…బీజేపీ బలపడటం గ్యారెంటీ. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా వలసలే బీజేపీకి బలమని తేలింది. అంటే ఎంత ఎక్కువగా నేతలు ఇతర పార్టీల నుంచి వస్తే…అంత ఎక్కువగా బీజేపీ బలపడుతుంది. మొత్తానికైతే కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి కారు పార్టీకి కలవరం పుట్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version