దీపావళి ఎఫెక్ట్.. సికింద్రాబాద్‌లో కిక్కిరిసన జనం

-

దీపావళి పండుగ నేపథ్యంలో నగర వాసులు మరోసారి సొంతూర్లకు తరలుతున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీకి తగ్గ బస్సులు, రైలు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఫుల్ రష్‌లోనే జర్నీలు చేయాల్సి వస్తోందని ప్యాసింజర్స్ ఆరోపిస్తున్నారు. పండుగకు తోడు వీకెండ్ కూడా వస్తుండటంతో ఐటీ ఉద్యోగులు సైతం ఊర్ల బాట పట్టినట్లు సమాచారం.

ఇప్పటికే కొందరు వర్క్ ఫ్రం హోం పర్మిషన్ తీసుకుని తమ సొంత వాహనాల్లో బయలు దేరగా.. బస్సులు, రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక సికింద్రబాద్ రైల్వే‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ, ఆంధ్రతో పాటు ఉత్తర భారతానికి వెళ్లే ప్రయాణికులకు కేంద్రంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉంది. దీపావళి భారతీయులు ఘనంగా జరుపుకుంటారు. ఫలితంగా స్టేషన్‌లోని ప్లాట్ ఫామ్స్ మొత్తం రద్దీగా మారాయి. లక్షలాది జనం సొంతూళ్లకు వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version