బిఆర్ఎస్ నేతలు చేతకాని దద్దమ్మలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ప్రారంభమైన పోలింగ్ బూత్ స్థాయి కమిటీల సమ్మేళనం గద్వాల పట్టణంలో శనివారం ప్రైవేట్ హాల్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డీకే అరుణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులను ముందు పెట్టి బిఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
పోలీసులు బిఆర్ఎస్ నేతల జీతగాల్లలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు ఇచ్చేది కేసీఆర్ కాదని.. ప్రజలు ఇస్తున్నారని అన్నారు. యూనిఫాం వేసుకుని బెదిరిస్తే బెదిరేది లేదన్న డీకే అరుణ.. తిరగబడితే ఊళ్లోకి అడుగుపెట్టలేరని హెచ్చరించారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకి ప్రధాని మోదీని విమర్శించే స్థాయి లేదని అన్నారు. లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద మోపి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులను, రైతులను, దళితులను మోసం చేశారని అన్నారు.